ముత్తారం గౌడసంఘం అధ్యక్షుడిగా బొంగోని రవీందర్

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని ముత్తారం గ్రామంలో ఆదివారం గౌడ సంఘం సభ్యులు సమావేశమయ్యారు.గ్రామ గౌడ సంఘం నూతన అధ్యక్షుడు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా బొంగోని రవీందర్, ఉపాధ్యక్షుడిగా సుద్దాల రఘు, పంజాల లక్ష్మణ్, గట్టు రాజేష్, సుద్దాల ప్రభాకర్, ఆరే అనిల్, పొన్నం సతీష్, మార్గ చందు, మార్క రాజేంద్రప్రసాదులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు బొంగోని రవీందర్ తన ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని తాటి ఈత వనాల అభివృద్ధితో పాటుగా సంఘ అభివృద్ధికి తోడ్పడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.