వీర్నపల్లి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా బొంగు తిరుపతి

నవతెలంగాణ-వీర్నపల్లి
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బంజేరు గ్రామానికి చెందిన బొంగు తిరుపతి యాదవ్ నియమిస్తూ  శుక్రవారం  యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు నియామక పత్రాన్ని అందజేశారు. సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ నా నియామకానికి సహకరించిన జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ కు, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఇచ్చిన బాధ్యతలను నిర్వర్తిస్తు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కాన్స్టెన్సీ అధ్యక్షులు చుక్క రాజశేఖర్, భాను, మధు తదితరులు పాల్గొన్నారు.