పెద్దపెల్లి పార్లమెంట్ టికెట్ గజ్జల కాంతంకి ఇవ్వాలి: బొంకురి సురేందర్

నవతెలంగాణ – మంథని
కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద పెళ్లి పార్లమెంట్ టికెట్ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్,టిఏవైఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గజ్జల కాంతంకే ఇవ్వాలని మాదిగ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకురి సురేందర్ సన్నీ డిమాండ్ చేశారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి జైలు జీవితం గడిపిన మాదిగ ముద్దుబిడ్డ గజ్జలకాంతంకే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే తాము అధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నాలుగు లక్షల పై చిలుకు మాదిగ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయని,కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ కేటాయించాలని వారు కోరారు. గతంలో ఎంపిక కొనసాగిన వారెవరు పెద్ద పెళ్లి పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో చేపట్టలేదని,అలాగే దళితులకు ఎలాంటి న్యాయం అందించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో పదవులు అనుభవించి విదేశాలకు పరిమితమయ్యారని,అలాంటివారికి టికెట్ కేటాయించవద్దని వారు సూచించారు.అలాగే కుటుంబ పాలనకు వ్యతిరేకమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వివేక్ కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వరాదని వారు అన్నారు.తాత నుండి మొదలుకొని మనవడి వరకు వారే రాజకీయంగా ఎదగడం ఇంతవరకు సబవని ఆయన ప్రశ్నించారు.పెద్దపల్లి పార్లమెంటు టికెట్ గజ్జల కాంతంకు ఇచ్చినట్లయితే పార్టీలకు అతీతంగా తాము ఉమ్మడిగా కలిసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలోతెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి,జిల్లా అధ్యక్షుడు మంథని లక్ష్మణ్,మంథని మండల అధ్యక్షుడు కరుణకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల తిరుపతి, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్,అంబేద్కర్ సంఘం నాయకులు తోకల మల్లేష్,రోడ్డ రాజేశ్వరరావు పాల్గొన్నారు.