నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. సీఎంను కలవడంతో ఆయన బీఆర్‌ఎస్‌ను వీడుతారనే ప్రచారం జరుగుతున్నది.