మండల రైతులకు బోనస్..

Bonus for mandal farmers..– సీఎం, ఎమ్మెల్యే, ఝాన్సీ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకం 

నవతెలంగాణ – పెద్దవంగర
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఈ సీజన్ నుంచే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హామీ మేరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది. మండలానికి చెందిన రైతులకు బోనస్ జమ కావడంతో మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్లెక్సీలకు మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి రైతుల బాంధవుడని, రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అండగా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని తెలిపారు. రైతుల ఖాతాలో బోనస్ జమ కావడంతో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పూర్ణచందర్, ఓరిగంటి సతీష్, అనపురం శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, ఎండీ జాను, సీతారాం నాయక్, బానోత్ వెంకన్న, గద్దల ఉప్పలయ్య, అనపురం వినోద్, ఆవుల మహేష్ తదితరులు పాల్గొన్నారు.