
– సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలను నమోదు
– ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్కే ఓటు వేయాలి
– బూర తెచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలి
– పసుమముల గ్రామంలో సర్వే 106 భూమి ఏడూ ఎకరాల భూమికి ఎల్ ఓ సి ఇచ్చిన ఘనుడు బుర నర్సయ్య గౌడ్
– భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ – భువనగిరి
పార్లమెంటు ఎన్నికలలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మూడో స్థానంకు వెళ్లిపోవడంతో అసహనంతో తనపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ సంతకం ఫోర్జరీ చేస్తే నాకు కాంగ్రెస్ బీఫామ్ వస్తుందా అంటూ భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి బూర నర్సయ్య గౌడ్ పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలో దీప్తి హోటల్లో మీడియా సమావేశం కాంగ్రెస్ పార్టీ ఎంపి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నిర్వహించి మాట్లాడారు. బిఆర్ఎస్ నాయకులకు తెలివి లేక తనపై ఆరోపాలు చేస్తే దాన్ని పట్టుకొని చదువుకున్న బూర నర్సయ్య గౌడ్ కనీసం విచారణ చేయకుండా ఆరోపణలు చేయడం రాజకీయ అవగాహన లేని వ్యక్తి అని విమర్శించారు. నేను తెల్ల కాగితానని ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చిన యువకుడ్ని అని తెలిపారు. నేను ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడుని అయితే భువనగిరి పార్లమెంట్ ప్రజలకు మంచిదే కదా అని తెలిపారు ఈ ప్రాంతం అభివృద్ధికి మరింత నిధులు తెచ్చే అవకాశం ఉందన్నారు. నా తల్లిదండ్రులు నా పార్టీ ప్రజలను మోసం చేసే విధంగా పెంచలేదన్నారు. 2016 నుండి రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నారని తెలిపారు. ఎన్ ఎస్ యు ఐ యూత్ కాంగ్రెస్ తో పాటు ఆలిండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీగా పనిచేశానని తెలిపారు మీడియా సెల్ ఇన్చార్జిగా పనిచేశానని తెలిపారు. గత రెండు సంవత్సరాల నుండి రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిర్వహించిన పోరాటాల్లో పాల్గొన్నానని తెలిపారు రాజు భవన్ ముట్టడి కార్యక్రమంలో జరిగిన లాఠీచార్జిలో మూడు రోజులు ఆస్పత్రి పాలైన అని తెలిపారు. కుల, మతాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న బూర నర్సాగౌడ్ పేదలకు చేసి దేవి లేదన్నారు ఎంతమంది బీసీలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రశ్నించారు ఎంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాడు తెలుపాలన్నారు. బూర నర్సయ్య గౌడ్ ప్రచారం లో ఏడూ నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు ఎందుకు ప్రచారంకి రావడంలేదు..కులం, మతం అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తుండని ఆరోపించారు..పసుమముల గ్రామంలో సర్వే 106 భూమి ఏడూ ఎకరాల భూమికి ఎల్ ఓ సి ఇచ్చిన ఘనుడు బుర నర్సయ్య గౌడ్ అక్రమాలు చాలా ఉన్నాయని తెలిపారు.
నర్సయ్య గౌడ్ ఎవరితో సంసారం చేస్తుండు … ఎన్నికల ఆఫడివిట్ లో చెప్పిండా అని ప్రశ్నించారు. తనపై వ్యక్తిగత అబద్ధపు ప్రచారాలు చేయడంతో తను ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొనడమే కాకుండా పార్లమెంటులో పోరాడిన వ్యక్తి కోమటిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఎయిమ్స్ వచ్చిందన్నారు. తనకు తన మిత్రులకు సంబంధించిన కార్పొరేట్ వైద్యశాలలు నడవడానికి ఎయిమ్స్ రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారన్నారు. భువనగిరి ఎంపీ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిధుల కోసం ,అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి మోడీ కలిసి నిధులు తెచ్చారన్నారు. చేనేత కార్మికుల కోసం కేంద్ర మంత్రులను కలిసి పని అయ్యేవిధంగా కృషి చేశారన్నారు నితిన్ గడ్డి గారిని కలిసి గ్రీన్ క్యాండిడేట్ కోసం 15 సార్లు ఎంపీ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో బునాది గాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి, ఆసిఫ్ నగర్, కాలవల కోసం సుమారు రెండు కోట్ల రూపాయలు సొంత నిధులు ఖర్చు చేశారన్నారు. కెసిఆర్ ఎన్నికల అనంతరం ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి నిధులు కేటాయించలేదన్నారు. నువ్వు ఎంపీగా ఉండి ఎన్నిసార్లు ప్రధాన మంత్రి కలిశావో చెప్పాలన్నారు మీ పాత పార్టీలో ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసావు చెప్పాలన్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడని తెలిపారు. కులమతాలకు అతీతంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పనిచేస్తారు..గత కెసిఆర్ ప్రభుత్వం కేంద్ర నిధులు తీసుకోవడంలో విఫలమయ్యారన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలంటే నన్ను ఎంపీ గా గెలిపించండి. మోడీ పదేళ్లు పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజల సొమ్మును దొచ్చుకుంటే మోడీ ప్రభుత్వం ఏమి చేసిందన్నారు. కేసీఆర్ తెలంగాణ నిధులు కావాలని మోడీని అడిగిన దక్కాలు లేవన్నారు. బిజెపి ,బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులకు భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి పైన చిత్తశుద్ధి లేదన్నారు. చేనేత కార్మికులకు జిఎస్టి వేసి వాళ్ళును బ్రతకాకుండా చేశారన్నారు. 400 సీట్లు వస్తాయని చెప్పడం అంతా అబద్ధం అన్నారు .రష్యా ,చైనా దేశాలలో ప్రధాన మంత్రుల రాజ్యాంగం మార్చి పర్మినెంట్ ప్రధానమంత్రి ఉండాలని మోడీ చూస్తుండని ప్రజలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్కు ఓటు వేయాలని కోరారు. రాజ్యాంగంలో సెక్యులర్ అనే తొలగించడానికి రిజర్వేషన్లు తీయడానికి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఎస్సీ బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా అమేశాలు మోడీలు ఎవరిస్తున్నారని ఆరోపించారు. ఈ మీడియా సమావేశంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాస్ నేత భువనగిరి మున్సిపల్ చైర్మన్ పొతం శెట్టి వెంకటేశ్వర్లు, టిపిసిసి సభ్యులు రామ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ లక్ష్మి, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.