– బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ కొత్త ఆప్లికేషన్ల అభివృద్థి : మంత్రి శ్రీధర్ బాబు
నవ తెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ (బిసిఎస్ ) నాలుగు కొత్త కృత్రిమ మేధస్సు (ఏఐ)- ఆధారిత ఉత్పత్తులను-బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లురా, ఎడ్యు జెనీ, బయోస్టర్‌లను ఆవిష్కరించింది. వీటిని సోమవారం తెలంగాణ ఐటి శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఎఐ కొత్త ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా ఉంటుందన్నారు. ”చికిత్సను వ్యక్తిగతీకరించవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించవచ్చు, అంతిమంగా ఆరోగ్య సంరక్షణను ప్రతి వ్యక్తికి సమర్ధవంతంగా, మరింత అందుబాటులోకి తీసుకురావచ్చు. కలిసికట్టుగా, మనం ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తున్నాము” అని మంత్రి పేర్కొన్నారు. కృతిమ మేధస్సును ఉపయోగించుకోవడంలో బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ నిబద్ధతలో ఈ ప్రయోగం ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించిందన్నారు. విప్లవాత్మక డిజిటల్ పరిష్కారాలతో భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడంలో ఇది తన విజయాన్ని ప్రదర్శించనుందన్నారు. ఈ కార్యక్రమంలో బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బిసిఎస్) ఛైర్మన్ జానకి యార్లగడ్డ పాల్గొన్నారు.