నకిరేకల్ లో బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం

నవతెలంగాణ-  నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ బూత్ కమిటీ ఇన్చార్జిల సమావేశం గురువారం పట్టణంలోని సువర్ణ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ విధివిధానాలను, ఎన్నిబీకలలో అనుసరించిన అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, మినరల్ డెవలప్మెంట్ కార్పరేషన్ చైర్మన్ క్రేశాంక్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, చింతల సోమన్న, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.