
ఇందల్ వాయి జడ్పీ టీసి గడ్డం సుమన రవిరెడ్డి జిల్లా పరిషత్ నిధుల తో ఇందల్ వాయి మండలంలోని చంద్రయాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య నాయక్ తండా లోని అంగన్వాడీ కేంద్రం వద్ద వేసిన బోర్ మోటార్ ను సోమవారం బీఅర్ఎస్ నాయకులు ప్రారంభించారు. త్రాగునీటికి ఇబ్బందులు ఉన్నాయని జడ్పీ టీసి గడ్డం సుమన రవిరెడ్డి కు విన్నవించిన వేంటనే ఒక లక్షా యాభై వేల రూపాయలను మంజూరు చేశారని వారన్నారు.అడిగిన వేంటనే నిధులు మంజూరు చేయించిన జడ్పీ టీసి కి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బీఅర్ఎస్ సినియర్ నాయకులు సంజీవ్ రెడ్డి, అరటి రఘు, తాజా మాజీ ఉప సర్పంచ్ ప్రకాష్, సిహెచ్ గంగా దాస్, గ్రామ శాఖ అధ్యక్షులు పోతున్న భూమయ్య,బీర్ సింగ్, హరిలాల్,బంతిలాల్, వసంత్, వెంగళ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.