నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని పెద్దమల్లారెడ్డి హరిజన వాడలో నీటి కోరత ఉందని తెలుసుకొని, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తన సొంత ఖర్చుతో బుధవారం బోరు తవ్వకం ప్రారంభించినట్లు ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు సంజీవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసుల తరపున వెంకటరమణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న శంకర్, ఆకుల స్వామి, బుడ్డ రవి,బాబు,వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.