నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రం శివారులోని పెద్దగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం స్వాగత తోరణం వద్ద బోరు మోటర్ ను బుధవారం ప్రారంభించారు. పెద్దగుట్ట పైన కొలువై ఉన్న లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద భక్తులకు నీటి సౌకర్యం కల్పించేందుకు ఇటీవల గుట్ట కింద భక్తుల సహకారంతో స్వాగత తోరణం సమీపంలో బోరు వేశారు.బుధవారం మోటార్ బిగించి నీటిని ప్రారంభించారు. బోరు మోటర్ లో పుష్కలంగా నీరు రావడం పట్ల గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులతో పాటు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. బోరు మోటర్ ఏర్పాటుతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుట్టపై భక్తులకు నీటి ఇబ్బందులు తొలగిపోతాయని ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పేర్కొన్నారు.