నవతెలంగాణ- మోపాల్: మోపాల్ మండలం బోర్గం గ్రామానికి చేందిన కుర్మా సంఘము, శ్రీ సాయి లక్ష్మి నగర్ కాలనీ వాసులు నూడా చైర్మన్ ఈగ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తమ మద్దతు బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గం ఎం ఎల్ ఏ బాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు ఈగ నర్సారెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా నూడా చైర్మన్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం చేసినా సంక్షేమ పథకాలురూరల్ ఎం ఎల్ ఏ చేసినా అభివృద్ధి పనులను చూసి కారు గుర్తు కు ఓటేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కాలనీ వాసులను కోరారు. దానికి కుర్మా సంఘము సభ్యులు, కాలనీ వాసులు తప్పకుండ ఓటేసి గెలిపించుకుంటామని అన్నారాని గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమం లో సొసైటీ చైర్మన్ యన్. చంద్ర శేకర్ రెడ్డి, కుర్మా సంఘము అధ్యక్షులు దాహిని గంగారాం, బి. శ్యామ్ రావు, గంగాధర్, దండు పెంటయ్య మరియు సాయి లక్ష్మి నగర్ కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పల్లె శ్రీనివాస్, బంటు దాస్, వినోద్, కిషన్, దేవేందర్, విట్టల్, కమర్స్ నాడ్పి గంగారాం, బెండు భూమయ్య, దాహిని మహేష్, నాడ్పి గంగారాం కుల సభ్యులు కాలనీ వాసులు పాల్గొన్నారు.