
నవతెలంగాణ – పెద్దవూర
ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి.. ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ, వీడిపోమంటూ స్టూడెంట్ నంబర్ వన్ సినీమా తరహాలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు తొమ్మిదో తరగతి విద్యార్థులు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండల కేంద్రం లో శాంతి నీకేతన్ ఉన్నత పాఠశాల లో బుధవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం వేడుకలా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రిన్సిపాల్ నడ్డి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడు తూ పట్టుదలతో చదివి ఆదర్శంగా నిలవాలన్నారు. ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారని ఎంతోమంది ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతో మంచి ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు.విద్యార్థులు అందరూ పరీక్షలన్నీ ముగించుకొని వారు వెళుతున్నప్పుడు తమకు చాలా బాధగా ఉంటుందని విద్యార్థుల మీద వారి ప్రేమను వ్యక్తపరిచారు. అలాగనే విద్యార్థులు వారి ఉపాధ్యాయులపై ఎంతో కాలం నడిచిన ఈ అనుబంధాన్ని మరవలేక పోతున్నామని ఎంత స్థాయికి వెళ్లిన తమ గురువుల్ని గుర్తుపెట్టుకుని గురువులను తల ఎత్తుకునే విధంగా గొప్ప స్థాయికి వెళ్తామని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు మంచి పునాది ఇవ్వడంలో100 కృషి చేశామని వారు గొప్పఎత్తులకు ఎదిగి తమ పేరుని నిలబెట్టాలని వారి ఆశ భావం వ్యక్తపరిచారు.అనంతరం నృత్యాలతో, గీతాలతో, స్లామ్ పుస్తకాలతో, ఒకరికొకరు ఉండిపోయేలా విద్యార్థులు తమ తమ భావాలను వ్యక్తపరచుకున్నారు. అనంతరం గతం ఈ పాఠశాల లో చదివి ఉద్యోగాలు చేస్తున్న వారిని ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,రమేష్, వెంకన్న, శంకర్,రమీజ, శ్రీ లక్ష్మి,అనిత, నవ్య, శివలీల, పుష్ప, శిరీష, రాణి, లావణ్య, సంధ్య, లలిత, మౌనిక, అపర్ణ తదితరులు వున్నారు.