జెడ్పీటీసీ నిధుల నుండి బోరు పనులు ప్రారంభం

నవతెలంగాణ( వేల్పూర్ ) – ఆర్మూర్
మండలంలోని పడగల్ గ్రామంలో జెడ్పీటీసీ నిధుల నుండి మంజూరైన రెండు బోరు మోటర్ లను జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ భారతీ రాకేష్ చంద్ర మాట్లాడుతూ జెడ్పీటీసీ నిధుల నుండి పడగల్ గ్రామానికి రెండు బోరుబావులకు  మంజూరు ఇప్పించడం జరిగిందని, ఇందులో శివాలయంలో ఒక బోరు మోటర్, అదేవిధంగా ఎస్సీ మాల సంఘనికి ఒక్కో బోరు మోటర్ కు రూ. లక్ష 25 వేల రూపాయల చొప్పున మొత్తం రూ.రెండు లక్షల 50 వేల రూపాయల మంజూరు ఇప్పించడం జరిగిందని తెలిపారు. ఈ బోర్ మోటార్లను ఈరోజు  ప్రారంభించడం జరిగిందని తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల అభివృద్ధిలో మాజీ  మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రోత్సాహంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలుచేసుకోవడం జరుగుతుందని తెలిపారు. పడగల్ గ్రామానికి రెండు బోరు మోటార్లను మంజూరు ఇప్పించిన జెడ్పీటీసీ భారతీ రాకేష్ చంద్ర కు శివాలయఆలయ కమిటీ, ఎస్సీ మాల సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువా పూలమాలతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, ఎంపీటీసీలు పాపాయి  విజయ రాజేందర్, హేమలత శ్యామ్ రావు,మాజీ సర్పంచ్ వర్షిని రాజకుమార్, మాజీ ఉపసర్పంచ్ యాళ్ల శ్రీనివాస్ రెడ్డి,సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మాజీ ఏఎంసి మెంబర్ చందర్, శివాలయ   సభ్యులు జంగం శివ, కృష్ణ, రాజు, మాల సంఘం సభ్యులు గైని ప్రేమ్, గైని దాస్, గంగాధర్, మరియు కుల సంఘ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు.