సెమీస్‌లో బోస్‌ కిరణ్‌

సెమీస్‌లో బోస్‌ కిరణ్‌– హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌
హైదరాబాద్‌: 16వ హైదరాబాద్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో బోస్‌ కిరణ్‌ సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు. పురుషుల 40 ప్లస్‌ సింగిల్స్‌లో బోస్‌ కిరణ్‌ 8-3తో సురేశ్‌ ముతుపై విజయం సాధించారు. 50 ప్లస్‌ డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో చంద్రశేఖర్‌ రెడ్డి, శ్రీధర్‌లు 8-5తో కష్ణారెడ్డి, ఆదిశేషలపై విజయం సాధించారు. 50 ప్లస్‌ సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ఫైనల్లో సివి ఆనంద్‌ 8-2తో చంద్రశేఖర్‌పై అలవోక విజయం సాధించి సెమీస్‌కు చేరారు. పురుషుల డబుల్స్‌ 50 ప్లస్‌ విభాగం క్వార్టర్‌ఫైనల్లో వహీద్‌, నంద్యాల జోడి 8-4తో శ్రీనివాస్‌, ప్రసన్నలపై విజయం సాధించారు.