దివ్యాంగులకు బాస్ పాస్ మేళ

Boss pass mela for the disabledనవతెలంగాణ – గోవిందరావుపేట
 మండలం లోనీ చైల్వాయి గ్రామపంచాయతీ యందు వరంగల్ టు డిపో మేనేజర్ జోష్ణ మరియు అసిస్టెంట్ మేనేజర్  ఆదేశానుసారం శుక్రవారం  దివ్యాంగుల సంఘం ములుగు జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్  ఆధ్వర్యంలో బస్సు పాస్ మేళ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో 32 మంది దివ్యాంగులకు 50 శాతం రాయితీ బస్ పాస్ అందజేయడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా దివ్యాంగుల అందరూ ఉపయోగించుకోవాలని జిల్లా అధ్యక్షులు పెద్ద బోయిన శ్రీనివాస్  సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భారతి మేడం, యల్. శంకర్ ఆర్టిసి కంట్రోలర్ మరియు సమ్మిరెడ్డి దివ్యాంగులు పాల్గొనడం జరిగింది.