కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఈనెల 25న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా హీరో కార్తికేయ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 2012లో యుగాంతంపై బాగా చర్చ వినిపించింది. దీనిపై రెండు మూడు హాలీవుడ్‌హొసినిమాలు కూడా వచ్చాయి. వాటిని కూడా నేను చూశా. కరోనా సమయంలో క్లాక్స్ కథ చెప్పాడు. ఆ సమయంలో ప్రపంచం అంతా అయిపోతుందని అన్నట్లు ప్రచారం జరిగింది కదా! అందుకే కథకు బాగా కనెక్ట్ అయ్యాను.
ఈ కథకు రిఫరెన్స్ అంటూ ఏమీ లేదు. అంత కొత్తగా ఉంటుంది. సినిమా కంప్లీట్ అయ్యాక చూసుకున్నా. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బాగా వచ్చింది. ఫన్, మెసేజ్ రెండూ ఉన్నాయి. సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆలోచించేలా సన్నివేశాలు, డైలాగులు ఉంటాయి. వారిలో చిన్న మార్పు వస్తుందని నమ్ము తున్నాను. రెండున్నర గంటలు పూర్తిగా ఎంజారు చేస్తారు.
ఇందులో శివ అనే కుర్రాడి పాత్రలో నటించా. తనొక స్వేచ్ఛా జీవి. తనకు నచ్చినట్లు జీవిస్తాడు. వాడి పని వాడు చేసుకుంటాడు. నచ్చని విషయం చేయమంటే అసలు చేయడు.హొ’ఆర్‌ఎక్స్ 100’లో, ఇందులోనూ నా పేరు శివ. రెండూ గోదావరి నేపథ్యంలో తీసినవే. కథలు నచ్చి రెండు సినిమాలు చేశా. పేరు పరంగా ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యి ఈ సినిమా కూడా హిట్ అయితే హ్యాపీ. హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం.హొ సిటీ నుంచి ఊరికి వచ్చిన యువకుడిగా నా క్యారెక్టర్ ఉంటే, బెదురులంక ప్రపంచంహొమాత్రమే తెలిసిన ప్రెసిడెంట్ కూతురిగా నేహా శెట్టి కనబడుతుంది. సాంగ్స్, సీన్స్‌హొషూట్ చేసినప్పుడు మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యిందని అర్థమైంది.
ఈ కథ 2012 నేపథ్యంలో, పల్లెటూరిలోహొజరుగుతుంది. ఖర్చు విషయంలో నిర్మాత బెన్నీ అసలు రాజీ పడలేదు. సంగీత దర్శకుడిగా మణిశర్మనుహొతీసుకొచ్చారు. కథానాయికగా నేహా శెట్టినిహొసజెస్ట్ చేశారు. ఆయన నిర్మాణంలో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు క్లాక్స్ సినిమాని చాలా చక్కగా తీశాడు.
రామ్ చరణ్ ట్రైలర్ విడుదల చేశారు. ఆయనకు ట్రైలర్ నచ్చింది. మ్యూజిక్, షాట్స్‌హొమేకింగ్, నేహా శెట్టితో నా జోడీ బావుందన్నారు. నా గురించి కొన్ని మంచి విషయాలు చెప్పారు(నవ్వుతూ). అలాగే శివ శంకర్ వరప్రసాద్ డైలాగ్ గురించి సరదాగా మాట్లాడు కున్నాం.హొప్రస్తుతం యువి క్రియేషన్స్ సంస్థలోహొప్రశాంత్ అని కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీ జోనర్ ఫిల్మ్ అది. అలాగే మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి.
– కార్తికేయ