
61వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రెజ్లింగ్ (కుస్తీ) పోటీలు ఇటీవల హైదరాబాదులో నిర్వహించినట్టు ,పట్టణానికి చెందిన డా కూరి భాను ప్రసాద్ 86 కిలోల విభాగంలో, 65 కిలోల విభాగంలో జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ రహమాన్ బంగారు పథకాలు సాధించినట్టు కోచ్ భూపతి రాజు గురువారం తెలిపారు. ఈనెల 25వ తేదీన ఢిల్లీలో నిర్వహించే జాతీయ కుస్తీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ లో పాల్గొంటారని ఆయన తెలిపారు.