బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ ఒక్కటే

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి
– చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశం
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండూ పార్టీలు ఒక్కటేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు. రేపు జరగ బోయే చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికలలో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పనిచేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్‌ పరిధిలోని సంధ్య కన్వెన్షన్‌ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌ రెడ్డి, చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రేమెం దర్‌ రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామా రంగారెడ్డి, బీజేవైఎమ్‌ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్‌, అసెంబ్లీ నియో జకవర్గాల బీజేపీ నాయకులు అభ్యర్థులు, రాష్ట్ర నాయ కులు, పార్లమెంటు కన్వీనర్‌, అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా నా యకులు, డివిజన్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మం డల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చల అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులతో కలిసి పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ నాయకులు రవికుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షు లు కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ రెండు పార్టీలు ఒక్కటేనని, ఈ ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికల కోసం అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రజలను మభ్య పెడుతు మోసం చేస్తున్నారన్నారన్నారు. ప్రజలు మంచి చేసే నిస్వార్థమైన నీతివంతమైన బీజేపీనే గెలిపించడా నికి సిద్దంగా ఉన్నారని, ప్రార్టీ కార్యకర్తలు బూతు స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు, మంచి పనులు వివరిస్తూ నరేంద్ర మోదీ నేతత్వంలో బీజేపీ కి ఓటు వేస్తే కలిగే ప్రయోజనాలను తెలపాలని సూచించారు. చేవెళ్ల మాజీ పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడు తూ.. రేపు జరగబోయే చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికలలో పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్దంగా పనిచే యాలని, అన్ని నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు వారి వారి మండలాల్లో డివిజన్లలో పూర్తి స్థాయిలో పర్య టిస్తూ ప్రజలతో కలుస్తూ మరిన్ని చేరికలతో పార్టీనీ బలో పేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేం దర్‌ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ వారి బూతుల్లో ప్రజలను కలుస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిం చాలని, విజయ సంకల్ప యాత్ర, రామ మందీర్‌ యాత్ర విజయవంతం చేయాలని కోరారు, రవికుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ అన్ని నియోజవర్గాల్లో వారి వారి బూతు స్థాయిలో కార్యకర్తలు,నాయకులు దేశాభివద్ధికి, ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు వివరించి చెప్పా లని, బూత్‌ స్థాయి నుండి చేరికలు చేపట్టాలని సూచించారు.