వేర్వేరు కారణాలతో ఇరువురి మృతి…

– ప్రమాదంలో ఒకరు,ఆత్మహత్య లో మరొకరు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
నూతన సంవత్సరం 2025 మొదటి రోజే వేర్వేరు కారణాలతో ఇరువురు మృతి చెందారు. మండలంలోని అచ్యుతాపురం కు చెందిన ఉపేంద్ర(25) గత కొంత కాలం మద్యానికి బానిసై నిత్యం మద్యం సేవిస్తున్నారు.ఇతని తమ్ముడు ప్రేమ వివాహం చేసుకుని వేరు కాపురం పెట్టాడు.తల్లి లక్ష్మి ఉపేంద్రకు వివాహ సంబంధాలు చూస్తుంది.కానీ మద్యానికి బానిస కావడంతో పాటు ఆర్ధికంగా కుంగిపోవడం తో మనస్తాపానికి లోనై మరింత మద్యం సేవిస్తున్నాడు.ఈ క్రమంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని క్రిమి సంహారం సేవించాడు.గమనించిన ఇరుగుపొరుగు స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. మృతుని తల్లి లక్ష్మి పిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి,దర్యాప్తు చేపట్టామని ఎస్.ఎచ్.ఓ ఎస్.ఐ యయాతి రాజు తెలిపారు. మండల పరిధిలోని బచ్చువారిగూడెం రహదారిలో బుధవారం రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో గాండ్లగూడెం నుండి అదే గ్రామానికి చెందిన వాంకుడోత్ నాగచైతన్య( 17) బుల్లెట్ పై బచ్చువారిగూడెం వైపు వస్తుండగా బచ్చువారిగూడెం వైపునుండి గాండ్లగూడెం వైపు వస్తున్న ద్విచక్రవాహనం దారుడు ఎదురెదురుగా ఢీ కొన్నారు.ఇందులో నాగచైతన్య కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా మరి ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్.ఐ తెలిపారు.