ఇద్దరు ఇద్దరే నియోజకవర్గానికి చేసిందేమీ లేదు..

– ఒకరు ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి
– ఇంకొకరు వరస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న వ్యక్తి
– కొత్తగా ఏర్పాటు అయిన సిరిసిల్ల నియోజకవర్గన్ని చూసైనా నేర్చుకోవాల్సింది
– బిఎల్ పి, రాష్ర్ట ఉపాద్యక్షుకులు, సిరిగాద సిద్ధిరాములు 
నవ తెలంగాణ-తాడ్వాయి 
కామారెడ్డి నియోజకవర్గ నాయకుడు దేశస్థాయిలో పేరున వ్యక్తి ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖలకు మంత్రిగా పనిచేసిన వ్యక్తి సైతం కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. ఇంకొకరు వరస విజయాలతో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రభుత్వ విప్పుగా కొనసాగిన అనుకున్న స్థాయిలో కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని బహుజన లెప్ట్ పార్టీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, సిరిగాధ సిద్ధిరాములు అన్నారు. సోమవారం రోజున బిఎల్ పి పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూంలో నాణ్యత లోపించిందని దాన్ని నిరూపించడానికి నేను సిద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సవాలు విసరడం ఇంజనీర్లు చెప్పినట్టుగానే మేము నిర్మించామని అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పడం తాము డబుల్ బెడ్ రూమ్లను నాణ్యత గానే నిర్మించామని ఎన్నికల కోసం తమ ప్రభుత్వాన్ని బదనం చేయడానికి కాంగ్రెస్ నాయకులు డబుల్ బెడ్ రూమ్ ల నాణ్యత లోపించింది అని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొంటున్నారు. ఈ చర్చను కాసేపు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ, ( టిఆర్ఎస్ ) బిఆర్ఎస్ పార్టీ  కామారెడ్డి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది ఏం లేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు అయినటువంటి  సిరిసిల్ల జిల్లా ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందో దానిని చూసైనా స్థానిక నాయకులు తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంకి కృషి చేయలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడగానే నేను ఇది చేశాను, అది చేశాను అని చెప్పడం తప్పించి, ఆ ఇద్దరు నాయకులు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించినటువంటి రాజవ్ స్వగృహ ఇండ్లను అట్టి ఆవరణంలో ఉన్న స్థలాన్ని పేద ప్రజలకు పంచవలసిన రాష్ట్ర ప్రభుత్వం దానిని విక్రయించి డబ్బులు పోగు చేసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాటిని పంచలేని షబ్బీర్ అలీ, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్లల నిర్మాణాలలో   నాణ్యత లేవని గగ్గోలు పెట్టడం ఏమిటన్నరు. జనగామ, జంగంపల్లి గ్రామాలలో జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి నిర్మించినటువంటి డబల్ బెడ్ రూమ్ లను చూపించి రాష్ట్రంలోనే కామారెడ్డి నియోజకవర్గంలో డబల్ బెడ్ రూమ్ లను విల్లాల మాదిరిగా నిర్మించామని ప్రభుత్వ విప్ గొప్పలు చెప్పుకోవడం తప్ప ఆయన చేసింది ఏమి లేదన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్లను వెడల్పు చేయడంలో సంవత్సరాల సమయం తీసుకుని స్థానిక నాయకులకు నచ్చినట్టుగా రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేపట్టాడన్నారు. కొన్నిచోట్ల బలవంతంగా భవనాలను కూల్చివేసి మరికొన్నిచోట్ల భవనాల ముందు నుంచి మురకి కాలువలను తీసి పైకప్పులేసి వదిలివేశారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో షబ్బీర్ అలీ మంత్రిగా పనిచేసిన సమయంలో సిద్ధిపేట నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని కామారెడ్డి నియోజకవర్గానికి చెందిన షబ్బీర్ అలీ ఎన్నో శాఖలకు మంత్రిగా పనిచేసిన తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని ప్రస్తుతం తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి ఏం సాధిస్తారు అన్నారు. కామారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఒక్కరోజు కూడా కామారెడ్డి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడింది లేదని పేద ప్రజలకు ఎలాంటి న్యాయం చేయలేకపోయారని కార్మికుల కష్టాలను అర్థం చేసుకోలేకపోతున్నారన్నారు. నియోజకవర్గాలలో కొందరు రాజకీయ నాయకులు పేదల భూములను కబ్జా చేస్తే పేదలకు న్యాయం చేయవలసింది పోయి రాజకీయ నాయకులకు సహాయం చేశాడన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఒక్కదాంట్లో మాత్రం విజయం సాధించారన్నారు. నిజాలు రాసిన విలేకరులను బెదిరించడం, తాను చెప్పిన పని చేయకపోతే అధికారులను తన నివాసానికి పిలిపించుకొని నోటికి వచ్చినట్లు తిట్టడంలో విజయం సాధించాడు అన్నారు.  యాసంగి పంటలు చేతికొచె సమయానికి వడగండ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఇండ్లు కులిపోయిన వారికి ఇండ్ల నిర్మించి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ఈ విలేకరుల సమావేశంలో, బిఎల్ పి,రాష్ట్ర నాయకులు, యం, ఆంజనేయులు, జిల్లా నాయకులు, సాయి కృష్ణ,స్వామి, గంగామణీ,లక్ష్మి, మల,స్తెనాజ్, రాధ,యస్, రాములు, జి,రాజాశేఖర్, నాంపల్లి,ప్రసాద్, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు,