ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాదిగ మాల ఉపకులస్తులు కూర్చొని సామరస్యంగా చర్చించుకోవాలని, సమగ్ర పరిష్కార మార్గం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలని, తదనంతరం రాజ్యాధికారం కోసం కల్సికట్టుగా ఉద్యమించాలని ధర్మ సమాజ్ పార్టీ (డి.ఎస్.పి) రాష్ట్ర కార్యదర్శి గడ్డం హరీష్ గౌడ్ సోమవారం బహుజన లోకానికి విజ్ఞప్తి చేశారు. ఓ/బీసీల సమగ్ర జనగణన జర్పాల్సిందే అంటూ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. పట్టణంలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 21న సాయంత్రం 6గంటలకు బాల్కొండ లోని ఎం.కె గార్డెన్లో జరగనున్న “బుద్ధం శరణం గచ్ఛామి” అనే గంటన్నర భవ్య నాటిక ఆహ్వాన పత్రాన్ని ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ముంబై నుంచి విచ్చేసిన ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు మూల్ నివాసి మాలజీ, జిల్లా నాయకులు అంగుళి మాలజీ, మమత మాలజీ, శివశక్తి భీంశక్తి చీఫ్ డి.ఎల్ మాలజీ, డి.ఎస్.పి మండల నాయకులు ఉమేష్ మహారాజ్, జర్నలిస్ట్ కాపు బొజన్న, పేర్కిట్ రజక సంఘం ఉద్యమ నేత మిరోల్ల బాలరాజు, పి.గోవర్ధన్ విశ్వకర్మ తదితర్లు పాల్గొన్నారు.