గుర్తు తెలియని కారు ఢీ కొని ఇరువురికి గాయాలు..

నవతెలంగాణ – అశ్వారావుపేట
గుర్తు తెలియని కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలైయ్యాయి.స్థానికుల కథనం ప్రకారం మండలంలోని అచ్యుతాపురం కు చెందిన ఎలికే వేణు,రొక్కం బాలాజీ శుక్రవారం తెల్లవారుజామున భీముని గూడెం సమీపంలోని పొలం నుంచి ద్విచక్రవాహనంపై తమ స్వగ్రామానికి వస్తున్న క్రమంలో ముత్యాలమ్మ ఆలయం వద్ద ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బాలాజీ కి ఎడమ కాలు విరగ గా, వేణు తల భాగంలో గాయాలైయ్యాయి. ఈ సమాచారం అందుకున్న చిట్టితల్లి అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రి కి తరలించగా వైద్యులు చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.