మండలంలోని నెర్మట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, నారపాక జంగులు సంతోష కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక పిల్లవాడు ఉన్నారు. వీరు దినసరి కూలీలు. చిన్న కుమారుడు అక్షయ్ 4ఏళ్ల బాలుడు ఉన్నాడు. ప్రతిరోజు అంగన్వాడి స్కూల్ కు వెళ్లేవాడు. ఆదివారం సెలవు దినం కావడంతో స్కూల్ కి వెళ్లలేదు. తల్లిదండ్రులు ఇద్దరు దినసరి కూలి కావడంతో పనికి వెళ్లారు. చిన్నారులు ఇంటి వద్ద ఆడుకుంటూ, తమ ఇంటి ముందు ఉన్న నీటి సంపులో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు నీటి సంపులోకి దిగి బయటికి తీసేసరికి బాలుడు అప్పటికే చెందాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో బాలుని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.