నవతెలంగాణ – మాక్లూర్
కుక్క దాడితో బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లేడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 25వ తేదీన గ్రామానికి చెందిన నిషన్ష్(5) అనే బాలుడు ఆడుకుంటూ ఉండగా ఓ కుక్క దాడి చేయటంతో బాలుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్యం చేయించారు. కాగా, బాలుడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆదివారం రాత్రి మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు.