డెంగ్యూతో బాలుడు మృతి

– నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతలలో ఘటన
నవతెలంగాణ – ఉప్పనుంతల
నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతల మండలంలోని మర్రిపల్లిలో శుక్రవారం బాలుడు డెంగ్యూతో మృతిచెందాడు. బాలుడు శిశువర్ధన్‌ డెంగ్యూ జ్వరంతో బాధపడ్డాడు. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. వర్షాకాలం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలని వైద్యులు, అధికారులు సూచించారు.