నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
సిద్దిపేట బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది రవికుమార్ పై సిద్దిపేట పోలీసులు దాడి చేయడానికి నిరసనగా రెండు రోజులపాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు నల్గొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి తెలిపారు. న్యాయవాదిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు.సిద్దిపేట బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాది రవికుమార్ పై సిద్దిపేట పోలీసుల దాడిని నిరసిస్తూ నల్గొండ బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించి కోర్టు ప్రాంగణం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం కార్యదర్శి గిరి లింగయ్య, న్యాయవాదులు జి. వెంకటేశ్వర్లు, శ్రీనివాస చక్రవర్తి, మామిడి ప్రమీల, వంశీ కృష్ణ, ఎం. ఆదిరెడ్డి, ఆవుల ప్రేమ్ సుందర్, ఏ. శంకరయ్య, ఎల్. గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.