– బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
సిద్దిపేటలో న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు విధులను గురువారం బహిష్కరించి, కోర్టు ప్రధాన ద్వారం ముందు నిరసన తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం తెలిపారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సిద్దిపేట కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది రవి కుమార్ ఓ కేసు విషయమై క్లైంట్ తరఫున మాట్లాడడానికి సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ ఉమారెడ్డి న్యాయవాదిపై దాడి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన ఏఎసైని సస్పెండ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఈ మధ్యకాలంలో న్యాయవాదులపై దాడులు ఎక్కువైపోయాయని, కేంద్ర ప్రభుత్వం న్యాయవాదుల రక్షణ కొరకు, రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి వెంటనే అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అవధూత రజనీకాంత్, విద్యాసాగర్ రావు, పెంట రాజు, కిషోర్ రావు, మాదాసు దేవయ్య, గడ్డం సత్యనారాయణరెడ్డి, రేగుల రాజకుమార్, గుజ్జే మనోహర్, తాహిర్ పాష, పరశురాములు, కనికరపు శ్రీనివాస్, అనిల్ కుమార్, తదితరులు ఉన్నారు.