‘సిక్సర్‌’పై కుర్రాళ్ల గురి

'సిక్సర్‌'పై కుర్రాళ్ల గురి– అండర్‌19 ప్రపంచకప్‌ ఫైనల్‌ నేడు
బెనోని : యువ భారత్‌ సిక్సర్‌పై కన్నేసింది. ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ను రికార్డు స్థాయిలో ఆరోసారి సొంతం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. నేడు బెనోనిలో జరిగే టైటిల్‌ పోరులో కుర్ర ఆస్ట్రేలియాతో తలపడనుంది. గతంలో ఎనిమిది సార్లు ఫైనల్‌కు చేరిన భారత్‌ ఐదుసార్లు విజేతగా నిలిచింది. ఆసీస్‌ మూడు సార్లు ఈ టోర్నీలో విజేతగా నిలిచింది. గ్రూప్‌ దశ నుంచి ఇరు జట్లు స్ఫూర్తిదాయక ప్రదర్శన చేశాయి. ఫైనల్లో భారత్‌ ఫేవరేట్‌ బరిలోకి దిగుతున్నా.. ఆసీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. భారత్‌కు ముషీర్‌ ఖాన్‌, ఉదరు సహరన్‌, సామీ పాండే, నమాన్‌ తివారీలు కీలకం కానున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్‌, ఆసీస్‌ అండర్‌19 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆరంభం కానుంది.