
పట్టణ కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర జూనియర్ కళాశాల యందు శుక్రవారం వాయిస్ ఫర్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పది రోజుల క్యాంపులో భాగంగా శుక్రవారం ఛాయిస్ ఫర్ చేంజ్ కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఈ శిబిరం కౌమారదశలో ఉన్న బాల బాలికలు తమ భవిష్యత్తు గురించి ఆలోచించడానికి, విద్య కెరియర్ ఎంపికలను అన్వేషించడానికి వీలు కల్పిస్తుందని ,వారిలో ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తుందని సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనేందుకు నమ్మకాన్ని ఇస్తుందని, సమాజంలో బాలుర పాత్ర, బాలికల పట్ల కలిగి ఉండాల్సిన ప్రవర్తన గురించి శిక్షకుల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కి విల్లా స్టైల్స్ ,ఫీల్డ్ కోఆర్డినేటర్ అజయ్ వర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, శిక్షకులు శ్రీనాథ్ రెడ్డి, నితిన్, కిషన్, మనోజ్, యోనాస్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.