
నవతెలంగాణ – రామగిరి
బిపి, షుగర్, క్యాన్సర్, వ్యాధులపై స్క్రీనింగ్ పూర్తి చేయాలని, జిల్లా వైద్యాధికారి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ (డిఎంహెచ్ఓ) డాక్టర్ అన్న ప్రసన్న కుమారి అన్నారు. మంగళవారం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో గల పీహెచ్ సెంటర్ ను ఆమె సందర్శించి మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా ఉన్నటువంటి 30 సంవత్సరాల దాటిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ వివిధ వ్యాధులపై స్క్రీనింగ్ పూర్తి చేయాలని, కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని ఆమె అన్నారు. అలాగే ఇప్పటివరకు 70% స్క్రీనింగ్ పూర్తయ్యాయని, డిసెంబర్ మాసం వరకు 100% పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో బేగంపేట పీహెచ్సీ సెంటర్ మండల వైద్యాధికారి డాక్టర్ ప్రదీప్, సిహెచ్ఓ డాక్టర్ భరత్,ఏఎన్ఎంలు, రాణి, మణెమ్మ, సరళ, వెంకటలక్ష్మి, స్వరూప, నిర్మల, మాధవి, కె శోభ, ఏ శోభ, తదితరులు ఉన్నారు.