– డీఎంహెచ్‌ఓ శశికళ
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులంబ గద్వాల జిల్లా కొత్త డీిఎంహెచ్‌ఓ ఆఫీస్‌లో బుధవారం ఎన్సీడీ సూపర ్‌వైజర్లకు జిల్లాలో ప్రారంభమైన ఏఎన్‌ఎం స్క్రీనింగ్ అనగా 30 సంవత్సరముల పైబడిన వారం దరికీ జిల్లాలో స్క్రీనింగ్ జరుగుతున్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్సిడీి సూపర్‌వైజర్లకు సమావేశం ఏర్పాటు చేసి సూచనలు సలహాలు అందించారు. స్క్రీనింగ్ క్యాంపులో ఆఫ్లైన్ రికార్డు మైంటైన్ చేయాలని స్క్రీనింగ్ నందు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని ఇచ్చిన టార్గెట్ మాత్రమే పూర్తి చేసి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ చేయాలని తెలిపారు.. రోజు జిల్లాకు రిపోర్ట్ పంపాలని, మొదట ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాతనే స్క్రీనింగ్ నిర్వహించాలన్నారు ఇట్టి స్క్రీనింగ్ క్వాలిటీ గా చేయాలని అబ్బాకార్డు జనరేషన్ చేసి ఎన్సీడీ పోర్టల్‌లో లింక్ చేయాలని సూచించారు. అవసరమైనప్పటికీ వారం వారం రివ్యూ చేస్తానని తెలిపారు.. బీపీ, షుగర్ ఉన్న వారందరికీ కూడా పోర్టల్‌లో అబా కార్డ్స్ క్రియేట్ చేయాలని తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ డీిఎంహెచ్‌ఓ డాక్టర్ సిద్ధప్ప, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జీ. రాజు, డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్యాంసుందర్, డీడీఎం రామాంజనేయులు, వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.