హైదరాబాద్: విద్యుత్ వాహనాల ఛాార్జర్ తయారీ సంస్థ సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) నుండి 1800 డిసి ఫాస్ట్ ఇవి ఛార్జర్‌ల ఆర్డర్ దక్కినట్లు ప్రకటించింది. ఈ ఆర్డర్ విలువ రూ.120 కోట్లుగా ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ప్రధాన నగరాల్లోని బిపిసిఎల్ పెట్రోల్ పంపుల వద్ద బిపిసిఎల్ ఇ-డ్రైవ్ ప్రాజెక్టుల్లో భాగంగా ఇవి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం 60కిలోవాట్, 120 కిలోవాట్ ఛార్జర్ వేరియంట్లను అందించనుంది. ఈ కాంట్రాక్టును 2024 చివరి నాటికి పూర్తి చేయనున్నట్లు సర్వోటెక్ పవర్ సిస్టమ్స్ తెలిపింది.