పంటపొలాలు ఎండిపొవడానికి బీఆర్ఎసే కారణం

– రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్
నవతెలంగాణ – రామగిరి పంట పొలాలు ఎండిపొవడానికి కారణం అప్పటి మీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, ఇప్పుడు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధులు నీళ్లు లేక ఈ ఏడు పంటలు ఎండుతున్నాయని మాట్లాడడం హస్యస్పదంగా ఉందని రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ ముస్త్యాల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ, గత వర్షాకాల సిజన్ జూలై, ఆగష్టు నెలలో వర్షాలు లేక కుంటలు చెరువులు బావులలో నీరులేక భూగర్భ జలాలు అడుగంటిపోయని, అది ప్రకృతి వైఫల్యం అని, అది అర్థం చేసుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ విమర్శించేందుకు వ్యవసాయ పొలాలు ఎండుతున్నాయని, బీఆర్ఎస్ పార్టీ ఓటమి నీ తట్టుకోలేక, ప్రభుత్వం లేకపోవడంతో జీర్ణించుకోలెని బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు తిరస్కరించిన బుద్ధి రావడం లేదన్నారు. గత ప్రభుత్వంలో మీరు అనాడు పొలాలకు సాగునీటి అందించాలని అలోచన చేసి ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, మంథని నియోజకవర్గంలో కాళేశ్వరం, మెడిగడ్డ, సుందిళ్ల బ్యారేజ్ లు ఉన్నప్పటికీ ఒక్క ఎకరం పొలానికి నీరు ఇవ్వకుండా కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారనీ, అప్పుడు అడిగే మొఖం మీకు లేదా అన్నారు. సాగునీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే చూస్తూ మౌనoగా ఉన్నారని, నోరు విప్పలేదని విమర్హించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించిన సాగునీటి ప్రాజెక్టులు ఏళ్ళ తరబడి నీరు అందిస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అనతి కాలంలోనే పిల్లర్లు కుంగిపోయి నీరు లేకుండా కాలీగా దర్శనం ఇస్తుందన్నారు.అర్థం లేని ఆరోపణలు మానుకోవాలని డిమాండ్ చేశారు