ఆధ్యాత్మికలో బ్రహ్మకుమారి సేవలు మరువలేనివి…

– చౌటుప్పల్ ఆర్డివో కె ఎం వి జగన్నాధ రావు 

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ కేఎంవి జగన్నాధ రావు బ్రహ్మకుమారిస్ ఆవిష్కరించిన నూతన సంవత్సర క్యాలెండర్లను గురువారం ఆవిష్కరింపజేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆధ్యాత్మిక విలువలతో కూడిన క్యాలెండర్ ఇవ్వటం జరిగింది. తాహాశీల్దార్ మండల ప్రజా పరిషత్ మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారుల కు క్యాలెండర్ ను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాహాశీల్దార్ హరికృష్ణ ఎంపీడీవో సందీప్ కుమార్ మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి డివో శ్రీనివాస్ కుమార్ మాధురి తదితరులకు క్యాలెండర్లు ఇవ్వటం జరిగింది. బ్రహ్మ కుమారిస్ స్వర్ణలత అక్కయ్య, సత్యనారాయణ, కుడికాల లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు