కాంగ్రెస్‌లో చేరిన బ్రాహ్మణపల్లి బీఆర్‌ఎస్‌ నాయకులు

నవతెలంగాణ-మాడ్గుల
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం పార్టీ సీనియర్‌ నాయకులు సూదిని కొండల్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో నాగర్‌ కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ ఠాకూర్‌ బాలాజీ సింగ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ గ్రామ శాఖ అధ్యక్షులు జెల్లా చంద్రయ్యగౌడ్‌, మాజీ ఉపసర్పంచ్‌ జెల్లా అచ్చయ్య, జెల్లా లక్ష్మయ్య, నాయకులు వెంకటయ్య, తిరు పతయ్య, కలగోని యాదగిరి తోపాటు మరో 20 మంది బీఆర్‌ఎస్‌ ను వీడి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చు కున్నారు. ఈ సందర్భంగా నాగర్‌ కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మెన్‌ బాలాజీ సింగ్‌ కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాడుగుల ఉపసర్పంచ్‌ అనెపాక మిద్దె రాములు, పీఎస్‌సీఎస్‌ డైరెక్టర్‌ కొప్పుల జగన్‌గౌడ్‌, జెల్లా రమేష్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.