ఘనంగా బ్రహ్మంగారి కళ్యాణం

నవతెలంగాణ – హాలియా
అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీమద్వివిరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 21వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులతో పోటెత్తిన దేవాలయం పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. గత 21 సంవత్సరాలు నుండి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు మన సాంప్రదాయాలకు, ఆచారాలకు కట్టుబడి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు.ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నవారు చిట్టిపోలు వెంకన్న, అలుగుల బ్రహ్మానందరెడ్డి,పంగ వెంకటేశ్వర్లు, పాతనబోయిన సురేష్, పిల్లి శ్రీను, కృష్ణమాచారి, మేకల పరమేశ, లింగయ్య,పంగ శ్రీను తదితరులు పాల్గొన్నారు