బాలకార్మిక వ్యవస్థపై బ్రహ్మాస్త్రం..

Brahmastra on child labor system..శ్రీలక్ష్మి ఎడ్యూకేషనల్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సమర్పణలో సంతోష్‌ ఫిలిమ్స్‌ నిర్మిస్తున్న బాలల చిత్రం ‘అభినవ్‌’. భీమగాని సుధాకర్‌ గౌడ్‌ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ వేడుకకు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌, నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్‌, నిర్మాత దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు భరత్‌ భూషణ్‌ విడుదల చేశారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం, గంజాయి మాఫియకు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు బలి కాకుండా, విద్యార్థి దశ నుండే ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌లలో శిక్షణ పొంది దేశ రక్షణలో విద్యార్ధులు కూడా భాగస్వాములు కావాలనేది ఈ చిత్ర కథ లక్ష్యం. ఈ చిత్రాన్ని సారథి స్టూడియో సహకారంతో పూర్తి చేశారు. సమ్మెట గాంధీ, మాఫియా డాన్‌గా సత్య ఎర్ర నటించిన ఈ చిత్రానికి కెమెరా – సామల భాస్కర్‌, సంగీతం – వందే మాతరం శ్రీనివాస్‌, ఎడిటర్‌ – నందమూరి హరి.