
మండలంలోని మామిడిపల్లి గ్రామ శివారులోని 63వ జాతీయ రహదారి ప్రక్కన గల అపురూప వెంకటేశ్వర ఆలయంలో సప్తాహ్నిక పుష్కర బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిసాయి. ఈ సందర్భంగా ఆలయ అవరణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం శాంతిపాఠము, వేదాది విన్నపములు, ద్వార తోరణ ధ్వజకుంభ ఆరా ధన, మూర్తికుంభ ఆరాధన, (దీర్ఘసుమంగళత్వానికి, సర్వ సౌభా గ్యానికై, అన్యోన్యదాంపత్య జీవనకై) శ్రీ లక్ష్మీ నారాయణ ఇష్టి, పంచ సూక్త హోమం, మహాపూర్ణాహుతి, నివేదన, మూర్తికుంభ ఉద్వాసన, బలి హరణ, చక్రస్నానము, మంగళాశాసనం. సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, దేవతోద్వాసన, ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగం, పల్లకి సేవ, ధ్వజ అవరోహణ, సప్తావరణము, నివేదన, శయనోత్సవము (ఏకాంత సేవ), మంగళాశాసనం, మహదా శ్రీర్వచనం, ఋత్విక్ సన్మానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్పర్సన్ అమృత లత, కమిటీ సభ్యులు రమాదేవి, ప్రభదేవి, రమణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అర్చకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు.