పేదలకు మేలు చేసేది బీఆర్ఎసే: కడియం శ్రీహరి

నవతెలంగాణ-ధర్మసాగర్: పేదలకు మేలు చేసేది బీఆర్ఎస్ పార్టీనేనని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. గురువారం మండలంలోని రాయి గూడెం, తాటికాయల, కర్ణాపురం గ్రామాలలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయని అన్నారు. కార్యకర్తలు రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ ఫలాలను గడపగడపకు చేరవేసి, ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన విధానాలను వివరించాలన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం,నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎంతో చిత్తశుద్ది, అంకిత భావం కలిగిన నాకు మరోసారి అవకాశాన్ని కల్పించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలనీ సూచనలు ఇచ్చారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం బిఆర్ఎస్ పార్టీ ద్వారానే అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా ప్రజలందరూ గుర్తించుకొని బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని కోరారు. పలు గ్రామాలలో ఇంటింట ప్రచారాన్ని నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మండలంలోని అన్ని గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి,గ్రామస్థాయి పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నాయకత్వాన్ని బలపరిచేందుకు పార్టీ మేనిఫెస్టో, అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమాలలో పిఎసిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎర్రబెల్లి శరత్, పెసర రమేష్, కలకోట అనిల్ కుమార్, కడియం యువసేన నాయకులు అడిగొప్పుల ప్రవీణ్ కుమార్, చిలుక విన్ను, బూత్ కమిటీ నాయకులు కొలిపాక రమేష్, దంతూరి బాలరాజు, చిర్ర రవీందర్ గారు, మేకల రవి, ఎండీ.సలీం, గంటే సదయ్య, ముప్పారపు కోటేశ్వర్, ఎండీ.సాదిక్, సోషల్ మీడియా ఇంఛార్జ్ ఎండీ.హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.