– ఇథనాల్‌పై బీఆర్‌ఎస్ ఇష్టారాజ్యం
– స్థానిక సంస్థలకు మోసం
– యథేచ్ఛగా మార్గదర్శకాల ఉల్లంఘన
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఇథనాల్ కంపెనీకి అనుమతుల వ్యవహారంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక ప్రజానీకాన్ని నిలువు నా మోసం చేసిందనే ప్రచారం ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్నది. పర్యావరణ శాఖ ఇచ్చిన అనుమతుల ను ఉల్లంఘించి నిబంధనలను తుంగలో తొక్కిన్నటు ్టగా తెలుస్తోంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో కేంద్ర ప్రభుత్వం ఫ్యూయల్ ఇథనాల్‌కు అనుమతి ఇస్తే, దాన్ని పట్టించుకోకుండా ఇథనాల్, ఎక్స్‌ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండిస్టియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్క హాల్ తదితర ఉత్పత్తులకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందనే విమర్శలు వస్తు న్నాయి. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే మినహాయింపు పొందేందుకు ఈ కంపెనీ అడ్డదారులు తొక్కింది. అప్పటి ప్రభుత్వం సదరు కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు నిర్ణయాలు తీసుకుని అమలుచేసినట్టుగా ప్రచారం జరుగుతున్నది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి ఈ కంపెనీ నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అండ దండల నేపథ్యంలో పర్యావరణ అనుమతుల నిబం ధనలను యధేచ్ఛగా ఉల్లంఘించింది. ఈ వ్యవహా రాంలో మాజీ సీఎం కేసీఆర్ చరుగ్గా వ్యవహరిం చారని సమాచారం. రెడ్‌జోన్‌లో ఉన్నప్పటికీ, అత్యవసరంగా అనుమతులు ఇవ్వడం ద్వారా స్థానిక ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
లెటర్ ఆఫ్ ఇండెంట్
2022 అక్టోబరులో 600 లక్షల లీటర్ల ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండిస్టియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇండెంట్ జారీ చేసింది. అప్ప టి ప్రభుత్వం రాష్ట్ర కేబినేట్ ఆమోదం లేకుం డానే అత్యవసరం పేరిట ఆదేశాలిచ్చింది. 2022 డిసెం బర్‌లో కేబినెట్ ఈ నిర్ణయాన్ని ర్యాటిఫై చేసింది.
పర్యావరణ అనుమతి
ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకోవటం తప్పనిసరి.ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ / ఇండిస్టియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు ”ఫ్యూయల్ ఎథనాల్” కోసమే దరఖాస్తు చేసింది. అక్కడ ప్రతిపాదించిన 300 సామర్థ్యం మొత్తం ”ఫ్యూయల్ ఎథనాల్” తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది.
ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు
కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందనీ, ప్రజాభిప్రాయ సేకరణ నుంచి మినహాయించారు.
మరోసారి ఎల్‌వోఐ
2023, ఫిబ్రవరి 24న కేంద్ర పర్యావరణ శాఖ ”ఫ్యూయల్ ఇథనాల్” ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ ఒకటిన ఈ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్‌కే పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్ మరోసారి ఇచ్చింది.
లైసెన్స్ కోసం దరఖాస్తు
కేంద్రం పర్యావరణ శాఖ కేవలం ”ఫ్యూయల్ ఇథనాల్” ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ పీవోకే కంపెనీ దానికి పరిమితం కాకుండా, కొత్త లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 2023 జూన్ ఏడున ఇథనాల్ / ఎక్ట్స్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండిస్టియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంది.
పర్యావరణ నిబంధనల ఉల్లంఘన
పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుం డానే కాంపౌండ్ వాల్ నిర్మించింది. పర్యావరణ అనుమతుల మార్గదర్శకాలను పక్కనబెట్టింది. ఇష్టానుసారం వ్యవహరించింది.
నీటి అనుమతి
ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్టు మెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజినీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చింది. అలాగే 2023 డిసెంబరు ఏడుకు ముందే ఈ కంపెనీకి అనుమతులన్నీ జారీ అయ్యాయి.