నవతెలంగాణ – మద్నూర్
బీర్కూరు మండలంలోని బైరాపూర్ గ్రామానికి చెందిన భక్తులు ప్రతి సంవత్సరం దిండి యాత్ర ద్వారా మహారాష్ట్రలో ప్రఖ్యాతగాంచిన పండర్పూర్ విఠలేశ్వర ఆలయానికి వెళ్లే భక్తులకు మంగళవారంనాడు మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో దిండి భక్తులకు ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం నిర్వహించారు. దిండి భక్తులకు అల్పాహారం అందించిన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నర్సింలు గౌడ్ కు ఇతర భక్తులకు దిండి యాత్ర భక్తులు అభినందనలు తెలియజేశారు.