విద్యార్థులకు అల్పాహారం అందజేత

Breakfast is served to the studentsనవతెలంగాణ – బొమ్మలరామవరం
మండలంలోని పెద్ద పర్వతాపురం గ్రామంలోని శ్రీ సాయి విద్యాధామం ఉచిత ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు మహిళల ఆరోగ్యం,పరిశుభ్రత అనే అంశంపై కార్యక్రమం నిర్వహించి, పాఠశాల విద్యార్థులకు పండ్లు ఆశ్రమ వాసులకు మధ్యాహ్న భోజన అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వామీ శ్రీ రామానంద ప్రభూజీ మాట్లాడుతూ.. సమాజ చింతన కలిగిన విద్యార్థిని, విద్యార్థులు మరింత సేవలో ముందుకు వెళ్లాలని వారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్ యూనిట్ అధ్యాపకులు ఓడయ్యా,మధుసూదన్ రావు ఆశ్రమ ఇన్చార్జి మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ జి. చంద్రారెడ్డి, పాఠశాల సిబ్బంది ఆశ్రమ వాసులు పాల్గొన్నారు.