తల్లిపాలు అన్నింటికన్నా శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు బిడ్డకు తల్లిపాలు పట్టించాలని, అంగన్వాడి ఉపాధ్యాయులు శనివారం వేములవాడ పట్టణంలోని వివిధ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ముర్రుపాలపై తల్లిపాల వారోత్సవాలు భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి ఉపాధ్యాయులు మాట్లాడుతూ డబ్బా పాలు వద్దు తల్లిపాలు పసి పిల్లల ఎదుగుదలకు శ్రేయస్కరమని మాతృమూర్తులకు సూచించారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. తల్లిపాల ప్రాముఖ్యతను తల్లులకు అవగాహన కల్పించడం జరిగిందని, ముర్రుపాలు ప్రాముఖ్యతను క్షుణ్ణంగా వివరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు ఏ సరస్వతి, ఎస్ మీనాక్షి, ఎం మునెమ్మ తోపాటు తదితరులు పాల్గొన్నారు.