తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి తలపారు. 7వ నెల నుండి పాలతో పాటు అదనపు ఆహారం అందించాలని అన్నారు. వడ్డెర బజార్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ మాసంలో భాగంగా చిన్నారులకు అన్నప్రాసన చేశారు.అనంతరం ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలకు అదనపు పోషకాహారం ఇవ్వాలని తల్లులకు సూచించారు. కార్యక్రమంలో ఈవో శ్రీరామ్మూర్తి, హెచ్వీ దుర్గ, హెల్త్ ఎడ్యుకేటర్ పి. బేబీ, ఏఎన్ఎం లు సుజాత, జి.సరస్వతి, పావని పలువురు తల్లులు పాల్గొన్నారు.