తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని ఐసిడిఎస్ ఎ సి డి పి ఓ వెంకటమ్మ, సూపర్వైజర్ యాదమ్మ,లు తేలపారు. 7వ నెల నుండి పాలతో పాటు అదనపు ఆహారం అందించాలని అన్నారు. మండలంలోని బంగారుగడ్డ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ్ మాసంలో భాగంగా కిషోర్ బాలికలకు రక్తహీనత పై అవగాహన కల్పించారు. అనంతరం ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలకు అదనపు పోషకాహారం ఇవ్వాలని తల్లులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్స్ లు, ఆశలు ,తల్లులు పాల్గొన్నారు.