పసిపిల్లలకు తల్లిపాలే శ్రేష్టం

Breastfeeding is best for babies

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం సూపర్వైజర్ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో కృష్ణ ప్రసాద్,ఎంపీ ఓ ప్రభాకర్ ఏపీఓ శారద, పీహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్ లు హాజరై మాట్లాడారు.గర్భిణీ స్త్రీలు పాలు,గుడ్లు, ఆకుకూరల వంటి పోషక విలువలు కలిగిన ఆహారము తీసుకొని పండంటి బిడ్డకు జన్మనివ్వాలని, జన్మించిన శిశువుకి గంటలోపు తల్లి ముర్రుపాలు అందించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలను నిత్యం అందిస్తూ, తర్వాత కాలంలో అనుబంధ పదార్థాలను అందించాలన్నా రు.తల్లిపాలే శిశువుకి ఉత్తమమని, తల్లిపాలతోనే పిల్లలు బలంగా ఎదుగుతారని అన్నారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, పిల్లలకు అక్షరాభ్యాసం అన్నప్రాసన చేయించారు.  కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, ఎంపీ ఓ ప్రభాకర్, మండల వైద్యాధికారి శ్రావణ్ కుమార్, ఏపిఎం సుధాకర్, ఏపీవో శారద,అంగన్వాడి సూపర్వైజర్ స్రవంతి, పిహెచ్ ఓ భాస్కర్, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, తల్లులు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.