
తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని గూడెం, తోటపల్లి గ్రామాల సర్పంచులు దేవా రాజశ్రీ,బోయినిపల్లి నర్సింగరావు సూచించారు. బుధవారం మండల పరిధిలోని గూడెం, తోటపల్లి గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంధజేస్తున్న పౌష్టికాహారంపై అంగన్వాడీ ఉపాధ్యాయులు గర్భిణులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ఉపాధ్యాయులు సరోజన, సుగుణ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.