
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరమని రాఘవాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి గొగ్గెల ప్రేమకళ, ఈశ్వర్ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు ఆళ్ళపల్లి మండలం మర్కోడు సెక్టార్ లోని రాఘవాపురం అంగన్వాడీ కేంద్రంలో ఈ నెల 1న ప్రారంభమైన తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.వెంకటేశ్వర్లు, అంగన్వాడీ టీచర్లు సుశీల, మల్లీశ్వరి, సరిత, పార్వతి, ఆశా వర్కర్లు రాజకుమారి, రేవతి, గర్భిణీలు, బాలింతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.తల్లి పాలే బిడ్డకు శ్రేయస్కరం