దుంపెల్లి గూడెంలో తల్లిపాల వారోత్సవాలు

Breastfeeding week celebrations in Dumpelli Gudemనవతెలంగాణ – గోవిందరావుపేట

దుంపెల్లిగూడెం అంగన్వాడీ కేంద్రం లో శుక్రవారం తల్లి పాల వారోత్సహవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీచర్ దీప మాట్లాడుతూ.. ఇది 1 వ తారీకు నుండి 7 ఆగష్టు వరకు జరుగుతాయనీ, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి  పాలు పట్టించాలని చెప్పడం జరిగింది మరియు 6 నెలల వరకు కేవలం తల్లిపాలు అందించడం మరియు పరిపూరకమైన ఆహారాన్ని సకాలం లో ప్రారంబించడం పై అవగాహనా కల్పించడం జరిగింది మరియు పాలిచ్చే తల్లులకు కౌన్సెలింగ్ చేయడం జరిగింది  అదే విధంగా , పాలిచ్చే తల్లులకు తమ సహాయాన్ని అందించడానికి కుటుంబసభ్యులకి అవగాహనా కల్పించడం జరిగింది. ఇందులో గర్భిణీ స్త్రీలు,పాలిచ్చే తల్లులు కిషోరబాలికలు,,0-2 సంవత్సరాల పిల్లల తల్లితండ్రులు, వారి కుటుంబసభ్యులు తల్లులు  నర్మధ, దీపిక, అఖిల శిరీష, స్వప్న, మహేశ్వరి, పూర్ణ, విజయం, నేహాశ్రీ, ఏఎన్ఎం సరిత, ఆశ కార్యకర్త రాజేశ్వరి, సెక్రటరీ సాంభమూర్తి   పాల్గొన్నారు.